![]() |
![]() |

ఏమిటి ఆ మార్పులు
తన సమాధానం ఏంటి
ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తుంది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas),సుజిత్(Sujith)కాంబోలో వచ్చిన 'సాహూ'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భామ 'జాక్వెలిన్ ఫెర్నాండేజ్'(Jacqueline fernandez).ఈ మూవీలో 'బ్యాడ్ బాయ్ సాంగ్ లో సూపర్ గా డాన్స్ చేసి తెలుగు సినిమా మూవీ లవర్స్ తనవైపు చూసేలా చేసుకుంది. శ్రీలంక దేశానికి కి చెందిన జాక్వెలిన్ 2009 లోనే 'అల్లాదిన్' అనే మూవీతో బాలీవుడ్ లో సినీ రంగ ప్రవేశం చేసి ఈ సంవత్సరం వచ్చిన హౌస్ ఫుల్ 5 వరకు హిందీతో పాటు పలు భాషల్లో సుమారు ముప్పై చిత్రాల వరకు చేసింది. వాటిల్లో అగ్ర హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి.గతంలో బొద్దుగా కనపడే జాక్వెలిన్ కొన్ని రోజుల నుంచి నాజూగ్గా సన్నబడి కనిపిస్తుంది.
ఆ విషయంపై రీసెంట్ గా జాక్వెలిన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మాంసాహారం ఇష్టపడే నేను ఇప్పుడు పూర్తి శాకాహారిగా మారిపోయి మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఈ చేంజ్ వల్ల శరీరంలో కొన్ని ఆశ్చర్యకరమైన, వింతైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చాలా ఏళ్లుగా వేధిస్తున్న ‘అడల్ట్ ఆక్నే’ (పెద్దవారిలో వచ్చే మొటిమలు) సమస్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ విషయంలో శాకాహారం ఒక వరంగా మారింది. బరువులో హెచ్చుతగ్గులు ఆగిపోయి స్థిరంగా ఉంటుంది చాలామంది శాకాహారులుగా మారితే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందదని భావిస్తుంటారు. కానీ అవన్నీ అబద్దాలు. బీన్స్ తలో పాటు పలు రకాల కూరగాయల ద్వారా మనకి కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా పొందుతుంది. ఒకవేళ అదనపు ప్రోటీన్ అవసరమైతే వీగన్ ప్రోటీన్ షేక్స్ తీసుకుంటున్నాను. కడుపు ఉబ్బరం సమస్య నుంచి కూడా విముక్తి లభించినట్టుగా చెప్పుకొచ్చింది.
also read: అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా
ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు స్పందిస్తున్నారు.మేము కూడా నీలాగే నాన్ వెజ్ మాసేసి వెజిటేరియన్ లోకి మారతామని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే వెల్ కమ్ టూ జంగిల్ అనే మూవీలో చేస్తుంది.
.webp)
![]() |
![]() |